Home » Traffic Police
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు.
వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. నో పార్కింగ్ అని బోర్డులు పెట్టినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ట్రాఫిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్(Hyderabad, Cyberabad) కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు.
రైతులు, వాహనదారులు పోలీసులకు పట్టుబడుతూనే ఉంటారు. ఏదో ఒక కారణంతో డబ్బులు ముక్కుపిండి మరి వసూల్ చేస్తుంటారు. కొందరే నీతి, నిజాయితీగా ఉంటారు. ఢిల్లీలో ఓ ట్రాఫిక్ పోలీస్ లంచం తీసుకున్నాడు.
నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న రాంగ్రూట్(Wrongroot) డ్రైవింగ్ను పూర్తిగా కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం ఉక్కుపాదం మోపారు.
‘వరల్డ్ ట్రాఫిక్ సిగ్నల్స్ డే’(World Traffic Signals Day)ను పురస్కరించుకుని నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వెలిగే లైట్లను లవ్ సింబల్(Love symbol) తరహాలో అమర్చుతున్నారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై వాహనచోదకుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా నగర ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే దేశ ప్రజలను మాత్రం పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి. ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య వల్ల ఇబ్బంది పడని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రోజురోజుకు జనాభా పెరగుతుంది. అందుకు సరిపడా రహదారులు, మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తున్నాయి.
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
విశాఖ: నగరంలో మందుబాబులు బరితెగిస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి తాజాగా మరో సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన మందుబాబులు మంత్రిగారి తాలూకా అంటూ హల్ చల్ చేశారు.