Share News

Balanagar: ప్రాణం తీసిన ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:44 AM

చలాన్ల వసూలుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఓ వాహనదారుడి ప్రాణం తీసింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Balanagar: ప్రాణం తీసిన ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం

తనిఖీలను తప్పించుకోబోయి బస్సు కింద పడి కార్పెంటర్‌ మృతి

  • పోలీసుల దురుసుతనంపై స్థానికులు, వాహనదారుల నిరసన.. లాఠీచార్జి

బాలానగర్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): చలాన్ల వసూలుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఓ వాహనదారుడి ప్రాణం తీసింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఏపీలోని కోనసీమ-అంబేడ్కర్‌ జిల్లా గేదెల లంకవ రం వాసి ముమ్మిడివరపు జోషిభాను(32).. హైదరాబాద్‌కు వలస వచ్చి గాజుల రామారం-రుడామేస్త్రీ నగర్‌లో కార్పెంటర్‌గా జీవిస్తున్నాడు. అతడి కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పంజాగుట్టలో పని పూర్తిచేసుకు వచ్చేందుకు ఆదివారం మధ్యాహ్నం తన బైక్‌పై బయలుదేరిన జోషిభాను.. ఐడీపీఎల్‌ టౌన్‌షి్‌ప గేట్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలను గమనించాడు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సూచన మేరకు బైక్‌ ఆపినట్లే ఆపి.. కుడి వైపునకు తిరిగి తప్పించుకోబోయాడు. ఆ క్రమంలో వెనుక వస్తున్న బైక్‌కు తగలడంతో రోడ్డు మధ్యలో పడిపోయాడు. అప్పుడే వెనుక నుంచి వేగంగా వస్తున్న మెదక్‌ డిపో ఆర్టీసీ బస్సు వెనుక టైర్‌ కింద పడి.. తల పగిలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


ట్రాఫిక్‌ పోలీసుల తీరు వల్లే

రోడ్డు ప్రమాదంలో కార్పెంటర్‌ మృతికి ట్రాఫిక్‌ పోలీసుల వైఖరే కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్ర మాద సమయంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గోపాల్‌ మద్యం మత్తులో ఉన్నాడన్నారు. జోషిబాను బైక్‌ ఆపాలని బెదిరిస్తున్న కానిస్టేబుల్‌ను తప్పించుకోబోయి ప్రాణా లు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షు లు చెప్పారు. జోషిబాను మృతి చెందగానే డ్యూటీలో ఉన్న ఇద్దరు హోంగార్డులు పరారైతే, కానిస్టేబుల్‌ అదృశ్యమయ్యాడని తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ స్థానికులు, వాహనదారులు వాగ్వాదానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.


కానిస్టేబుల్‌పై కేసు నమోదు

మృతుడు జోషిబాను సోదరుడు నాగఫణీంద్ర ఫిర్యాదు మేరకు బాలానగర్‌ పోలీసులు.. ప్రమాద కారకుడైన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గోపాల్‌పై బీఎ్‌సఎ్‌సఎ్‌సలోని 304ఏ సెక్షన్‌ కింద కేసు నమోదుచేశారు. అతడ్ని అరెస్ట్‌ చేయడంతోపాటు విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించాడా? అన్న విషయం నిర్ధారణకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అత్యుత్సాహంపై నిరసనతోపాటు వారి వల్లే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడనే ప్రచారం నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు నేతృత్వంలో సీసీటీవీ ఫుటేజీ వివరాలు, జోషిబాను మృతికి కారణమైన బస్సు వివరాల సేకరణలో పడ్డారు. ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీకి భయపడి ప్రాణాలు కోల్పోయిన బాధితుడి వాహనంపై చలాన్లు పెండింగ్‌లో లేకపోవడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:48 AM