Home » TS Assembly Elections
ఎల్లారెడ్డి ( Ellareddy ) లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీపీ మాధవి బాలరాజ్‌గౌడ్ ( Madhavi Balaraj goud ) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ( BJP ) దూకుడుతో దూసుకెళ్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఢీ కొట్టేలా జాతీయ స్థాయి నేతలతో ప్రచారం చేయించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
బోధన్ మండలం పెంటఖుర్దు క్యాంప్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS - Congress ) నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తగా మారింది. గ్రామంలో వేర్వేరుగా ఎన్నికల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు.
దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుందని.. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని కలిపి ఓకేదారిలో నడుపుతూ తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుంచారని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagdish Reddy ) వ్యాఖ్యానించారు.
కురవి వీరభద్రస్వామి దయ వల్ల తెలంగాణ కల సాకారం అయిందని.. ఇక్కడ మొక్కులను కూడా చెల్లించుకున్నానని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
తెలంగాణని సీఎం కేసీఆర్ ( CM KCR ) అప్పుల పాలు చేశారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళ వ్యక్తం చేశారు. మంగళవారం నాడు జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
85 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ ( Bellaiah Naik ) తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయం. రెండు సార్లు అబద్ధాలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని బెల్లయ్య నాయక్ అన్నారు.
వైరాలో 45 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. మంగళవారం నాడు వైరాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఇద్దరూ తోడుదొంగలేనని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) ఎద్దేవ చేశారు.