BRS - Congress: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-11-21T21:54:37+05:30 IST
బోధన్ మండలం పెంటఖుర్దు క్యాంప్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS - Congress ) నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తగా మారింది. గ్రామంలో వేర్వేరుగా ఎన్నికల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం పెంటఖుర్దు క్యాంప్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS - Congress ) నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తగా మారింది. గ్రామంలో వేర్వేరుగా ఎన్నికల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రచార వాహనాలు ఒకే ప్రాంతానికి చేరుకున్న సమయంలో వివాదం నెలకొంది. బీఆర్ఎస్ నాయకుల వాహనంలో మైక్ వైర్ లేకపోవడం వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఇరుపార్టీల మధ్య మాట మాట పెరిగి తోపులాటకు దారి తీసింది. ఇరుపక్షాలకు గ్రామ పెద్దలు, పోలీసులు నచ్చచెప్పారు. గ్రామంలో వివాదంపై ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు చేశారు.