CM KCR: రైతులకు 3 గంటల కరెంట్ ఎలా సరిపోతుంది
ABN , First Publish Date - 2023-11-21T16:14:35+05:30 IST
వైరాలో 45 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. మంగళవారం నాడు వైరాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఖమ్మం: వైరాలో 45 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. మంగళవారం నాడు వైరాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ... ‘‘రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మూడు గంటల విద్యుత్ ఇస్తే పొలానికి సరిపడా నీరు పారుతుందా? రైతులు 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షల పెంపు సెట్లు ఉన్నాయి. 30 లక్షల పెంపుసెట్లకు రూ.30 వేల కోట్లు కావాలి. రైతుల మోటారు పంపు సెట్లకు డబ్బులు ఎవరు ఇవ్వాలి. పోడు భూములకు సంబంధించి పోలీసులపై కేసులు ఎత్తివేశాం. 3,659 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి