Home » TTD
వైసీసీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. కరుణాకర్‌రెడ్డి రాజీనామాను దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వల్లవన్ ఆమోదించారు. ఈ మేకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy)కి ఎట్టకేలకు సెలవు మంజూరు అయ్యింది. ఈనెల 11నుంచి 17వరకు సెలవు ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ (CS Nirabh Kumar) ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో తిరుమల వదిలి వెళ్లవచ్చని కానీ రాష్ట్రం వదిలి వెళ్లవద్దంటూ సీఎస్ ఆదేశించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవులు రావడం, ఎన్నికలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.
తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.
తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ(TTD) గత ఏడాదిలో రికార్డుస్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని (దాదాపు రూ.773 కోట్ల విలువ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో(Hundi) కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు..
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేడు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దక్షణ భారతదేశంలో రెండవ అయోద్యధ్యగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పిలుస్తుంటారు.
అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.
తిరుమలలో యాత్రికుల మొబైల్‌కు టీటీడీ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే మెసేజ్ రావటం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమలలో ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుటామంటామన్నారు. గది తీసుకున్న వ్యక్తే మళ్లీ గది ఖాళీ చేయకపోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు..