Home » TTD
తిరుమలలో యాత్రికుల మొబైల్‌కు టీటీడీ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే మెసేజ్ రావటం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమలలో ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుటామంటామన్నారు. గది తీసుకున్న వ్యక్తే మళ్లీ గది ఖాళీ చేయకపోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. విద్యార్థులకు పరీక్షలు నడుస్తుండటంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
Andhrapradesh: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజీపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. ఈవోపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఉండి స్వామి వారికి సేవలు చేయాల్సిన టీటీడీ ఈవో అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపైన పూర్తి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 69,072 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. పిల్లలకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) గణనీయంగా తగ్గిపోయింది. నిన్నటి నుంచి భక్తులకు వేచి ఉండే అవకాశం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్‌తో పాటు పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో జనాభా భారీగా తగ్గుముఖం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి లభిస్తోంది.
Andhrapradesh: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు (Ramana Deekshitulu) టీటీడీపై అభియోగాలు మోపారనే కారణంతో ఏపీ పోలీసులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే నోటిసులపై ఏపీ హైకోర్టు (AP High Court) ను ఆయన ఆశ్రయించారు. తనకు పోలీసులు సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసులను హైకోర్టులో రమణ దీక్షితులు సవాల్ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్ట్ ఆదేశించింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 65,887 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.