Tirumala: టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవే...
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:13 PM
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమల, మార్చి 11: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
AP Politics: రెండ్రోజుల్లో టీడీపీలోకి వైసీపీ ఎంపీ..
మరిన్ని టీటీడీ నిర్ణయాలు...
2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు.
యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు..
బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం..
రూ.14 కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ..
గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు ఆమోదం..
ఐటీ సేవల కొసం 12కోట్ల నిధులు మంజూరు..
శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభం
INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...