Home » Ugadi 2024
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. అయితే కొన్ని చోట్ల ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉగాది ఉత్సవాల్లో అపశృతి తలెత్తింది.
తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం..
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు
Ugadi 2024: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది(Ugadi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! నవవసంతం అందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగువారి నూతన సంవత్సరాదికి..
ఉగాది పర్వదినం(Ugadi celebrations) పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో(devotees) రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం(indrakeeladri temple)లో పంచాంగ శ్రవణం(Panchanga Sravanam) ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
తైవాన్‌లోని హ్సించు నగరంలో తెలుగు వారంతా కలిసి తైవాన్ తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు నోరూరించే వంటకాలను నిర్వాహకులు అందించారు.