Share News

Indrakeeladri: ఉగాది పర్వదినం సందర్భంగా.. ఇంద్రకీలాద్రి ఆలయంలో పంచాంగ శ్రవణం

ABN , Publish Date - Apr 09 , 2024 | 07:53 AM

ఉగాది పర్వదినం(Ugadi celebrations) పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో(devotees) రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం(indrakeeladri temple)లో పంచాంగ శ్రవణం(Panchanga Sravanam) ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Indrakeeladri: ఉగాది పర్వదినం సందర్భంగా.. ఇంద్రకీలాద్రి ఆలయంలో పంచాంగ శ్రవణం

ఉగాది పర్వదినం(Ugadi celebrations) పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో(devotees) రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది క్రోధ నామ సంవత్సరం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలసిన ఉగాది పచ్చడి స్వీకరించి పండుగ జరుపుకుంటున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు దశావతారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటి పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.


మరోవైపు మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం(indrakeeladri temple)లో పంచాంగ శ్రవణం(Panchanga Sravanam) ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం మొదలవుతుందని చెప్పారు.

ఉగాది పండుగ(Ugadi festival) వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో నేడు పంట కాలం కూడా ప్రారంభమవుతుంది. దీంతోపాటు శ్రీరాముడు, యుధిష్ఠిరుల పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో నేడు సంతోషం, శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. ఈ తెలుగు పండుగను దక్షిణ భారతదేశం అంతటా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.


ఇది కూడా చదవండి

నీ వెనుక నేనున్నా

పోలింగ్‌ ఏజెంట్లుగా వలంటీర్లు!

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 07:58 AM