Share News

Ugadi 2024: మళ్లీ మంచి రోజులు వస్తాయి.. చంద్రబాబు కీలక కామెంట్స్..

ABN , Publish Date - Apr 09 , 2024 | 02:04 PM

Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం..

Ugadi 2024: మళ్లీ మంచి రోజులు వస్తాయి.. చంద్రబాబు కీలక కామెంట్స్..
Chandrababu

Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు.. దశా, దిశా నిర్దేశం చేసుకోవడానికి ఉగాది పండుగ ఓ వేదిక అని పేర్కొన్నారు. తెలుగు వారికి కొత్త ఏడాది ఉగాది నుంచే ప్రారంభం అవుతుందన్నారు. ప్రకృతికి, పండుగలకు సంబంధం ఉందన్నారు. చైత్ర మాసం నుంచి ప్రజా చైతన్యం వెల్లువెత్తాలని, మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు.

చంద్రబాబు ప్రసంగం యధావిధిగా..

‘ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి. ధరలు తగ్గాలి, శాంతి భధ్రతలు ఉండాలి, అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలి. సంపద సృష్టించాలి. ఆ సంపదను మంచికి ఉపయోగించాలి. ఆర్యవైశ్యులు తాము సంపాదించిన దాంట్లో కొంత భాగం బాధ్యతగా ప్రజా సేవ కోసం ఖర్చు పెడతారు. మంచి, చెడు అన్నింటిని సమానంగా చూడాలనే తత్వంతో ఉగాది పచ్చడి. వైసీపీ ప్రభుత్వంలో మంచి లేదు.. అంతా చెడే.. మొత్తం చేదు, కారంగానే మార్చారు. ప్రతి రోజూ ప్రజలకు ఇబ్బందులే. బకాసురుడి మాదిరి ఈ ప్రభుత్వానికి కప్పం కట్టాల్సి వస్తుంది. సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి.. రూ. 100 లాగేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తోంది. ఉగాది రోజున మళ్లీ మంచి రోజులు రానున్నాయనే సంకల్పం తీసుకోవాలి. ప్రజలకి అండగా ఉండేందుకే ఓ కూటమిగా వచ్చాం.’ అని చంద్రబాబు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 02:04 PM