Home » United Nations
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేళ.. యూఎన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్.. ఎన్నికలు జరుగుతున్న ఏ దేశంలోనైనా.. ప్రజల రాజకీయ, పౌర హక్కులు సేఫ్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్‌పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.
ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan).. తమ దేశ పరిస్థితుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా భారత్‌పై (India) విషం కక్కడమే పనిగా పెట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ని దోషిగా నిలబెట్టేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలు ప్రతిసారి బెడిసికొడుతున్నా, తీరు మార్చుకోకుండా పాక్ అదే వైఖరి కనబరుస్తోంది.
భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ రిపోర్టు ప్రకారం.. భారత ఆర్థిక వృద్ధి 2024(Indian Economy 2024)లో 6.2 శాతం ఉంటుందని తేలింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఇదివరకే రాజకీయ ప్రయోజనాల కోసం...
చైనా, పాకిస్తాన్, కెనడా.. ఈ మూడు దేశాలు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు...
దాయాది దేశమైన పాకిస్తాన్.. తన కింద నలుపు (ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు) చూసుకోకుండా గురువింద నీతులు చెప్తూ ఎప్పుడూ భారత్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై జమ్ముకశ్మీర్ అంశాన్ని...
కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో భారత్ హెచ్చరించినా.. టర్కీ మాత్రం తన వక్రబుద్ధి మార్చుకోలేదు. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌కు మరోసారి వత్తాసు పలుకుతూ..
ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చుతామని అయితే ఇందుకు సంబంధించి ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) అధికారిక ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పష్టం చేశారు.
మన దేశంలో పరిపుష్టమైన, సౌభాగ్యవంతమైన భాషలు అనేకం ఉన్నాయని, అయితే అవి ప్రగతి నిరోధక భాషలనే ముద్ర వేశారని, ఇంత కన్నా దురదృష్టం వేరొకటి ఉంటుందా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం, 2020 మూడో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన ఆలిండియా ఎడ్యుకేషన్ కన్వెన్షన్‌ను ప్రారంభించారు.