Home » UPSC
సివిల్స్‌లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి. టాపర్ అయ్యుండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలా ఎన్నెన్నో అనుకుంటారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారైతే యూపీఎస్సీ గురించి ఆలోచించేందుకే భయపడతారు. కానీ, పట్టుదల ముందు ఇలాంటి కొలమానాలన్నీ తక్కువే అని రుజువు చేశాడు బీహార్‌కు చెందిన అనురాగ్ కుమార్. స్కూల్లో, ఇంటర్లో ఫెయిలైన ఆ యువకుడు.. తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించాడు. అంతేనా.. వరసగా రెండుసార్లు సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేశాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువతి యూపీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. కోచింగ్ నిమిత్తం ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా అద్దెకు ఉంటోంది. అయితే అదే అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఇంటి యజమాని కుటుంబంతో కలిసి ఉంటున్నారు.
ఐఏఎస్ ప్రొబేషనరీ మాజీ అధికారిణి పూజా ఖేడ్కర్(Puja Khedkar)కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.
విపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. వివాదాస్పదంగా మారిన నేరుగా నియామకాల(లేటరల్ ఎంట్రీ) ప్రక్రియను నిలిపివేసింది. 2018 నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ రాజ్యాంగంపై, రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని అన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ రిక్రూట్మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బహిరంగంగానే లాక్కుంటున్నారని రాహుల్ గాంధీ విమర్వించారు.
నేరుగా నియామకాలు (లేటరల్ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఒక్కటే టెన్షన్. సరిగ్గా మరో 48 రోజుల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు ఇది కీలక సమయం.. చాలా మంది విద్యార్థులు చాలా డిస్టర్బ్‌గా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్లోకి భారీగా వర్షపునీరు చేరి, అక్కడ ఉన్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు(Pooja Khedkar) షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్‌ను భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది.