UPSC CSE 2025: యూపీఎస్సీ పరీక్షకు అప్లై చేసేముందు..కొత్త నియమాలు తెలుసుకుని.. గడువులోగా వివరాలు మార్చుకోండి..
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:09 AM
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీరు ఈ నోటీసును తప్పక చదవాలి.

UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, UPSC ఇటీవల సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2025 అభ్యర్థులకు OTR ప్రొఫైల్ అప్‌డేట్‌కు సంబంధించిన మార్పుల గురించి తెలియజేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే ఈ నోటీసును తప్పక చదవాలి.
ఈ తేదీల్లోగా దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు..
నోటీసు ప్రకారం, OTR ప్రొఫైల్ కింద ఈ పరీక్షలకు నమోదు చేసుకున్న అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 12-18 మధ్య తమ దరఖాస్తులను సవరించుకోవచ్చు. రెండు పరీక్షలకు దరఖాస్తులు సమర్పించడానికి ఫిబ్రవరి 11, 2025ను చివరి తేదీగా నిర్ణయించారు. ఇది అభ్యర్థులంతా గమనించాల్సిన విషయం.
జీవితకాలంలో ఒకసారి OTR మార్చడానికి అవకాశం..
అభ్యర్థి తన OTR (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) ప్రొఫైల్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అతను/ఆమెకి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అవకాశం లభిస్తుందని అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కమిషన్ ఏదైనా పరీక్షకు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నుంచి ఏడు రోజుల వరకు OTR ప్రొఫైల్‌లో సవరణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
మీ వివరాలను గడువులోగా మార్పులు చేసుకోండి..
ఒక అభ్యర్థి ఈ పరీక్షకు మొదటిసారి దరఖాస్తు చేసుకుంటుంటే OTR ప్రొఫైల్‌లో మార్పుకు చివరి తేదీ ఫిబ్రవరి 18, 2025. అయితే, అభ్యర్థులు ఈ క్రింది వివరాలను మాత్రమే సవరించగలరు:
పేరు/మార్చబడిన పేరు
పుట్టిన తేదీ
లింగం
తల్లిదండ్రులు / సంరక్షకుల పేరు
మైనారిటీ హోదా
10వ తరగతి బోర్డు పరీక్ష రోల్ నంబర్
OTR ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్న తర్వాత ఈ మార్పులు జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారని గుర్తుంచుకోవాలి. అలాగే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఈ-మెయిల్ ఐడీని మార్చలేరు. ఈ నియామక పరీక్షలకు సంబంధించి కమిషన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మీరు UPSC CSE లేదా IFS పరీక్షకు దరఖాస్తు చేయబోతున్నట్లయితే ఈ సమాచారాన్ని తప్పక చదవండి.
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..