Civil Services Exam: సివిల్స్ ఎగ్జామ్ దరఖాస్తు దారులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ మళ్లీ పొడిగింపు..
ABN , Publish Date - Feb 18 , 2025 | 08:18 PM
దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ మళ్లీ పొడిగింపు చేశారు. అయితే ఎప్పటివరకు పొడిగించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో సివిల్స్ పోటీ పరీక్షల (UPSC Civil Services Exam) కోసం అప్లై చేయాలనుకునే వారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ పరీక్షల దరఖాస్తు చేసుకునే గడువును మళ్లీ పొడిగించింది. తాజా నోటీసు ప్రకారం అభ్యర్థులు ఫిబ్రవరి 21, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని తాజాగా రెండోసారి పొడిగించారు.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ)-2025 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని 21.02.2025 (సాయంత్రం 6 గంటలకు) వరకు పొడిగించినట్లు కమిషన్ తన వెబ్‌సైట్‌లో జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది.
ఎడిట్ ఛాన్స్ కూడా..
అయితే రెండోసారి పొడిగింపు ఎందుకు చేశారనే దానికి ప్రత్యేక కారణం చెప్పలేదు. అంతేకాదు అభ్యర్థులకు 22.02.2025 నుంచి 28.02.2025 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తాయని ఫిర్యాదులు రావడంతో, కమిషన్ ఇటీవల ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో కొన్ని మార్పులు చేసింది. అభ్యర్థులు upsconline.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో ఎదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, అభ్యర్థులు వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
నోటిఫికేషన్, పరీక్ష తేదీ
ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షకు నోటిఫికేషన్ జనవరిలో విడుదలైంది. మొదట దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 11గా నిర్ణయించబడింది. అయితే ఈ నెల ప్రారంభంలో దీనిని ఫిబ్రవరి 18 వరకు పొడిగించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల సంఖ్య దాదాపు 979 ఉంటుందని అంచనా. వీటిలో 38 ఖాళీలు వైకల్యం ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా రిజర్వు చేయబడ్డాయి.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News