Home » Uttam Kumar Reddy Nalamada
టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా తూర్పు నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని ఐఐసీ భవన్‌కు గురువారం వచ్చిన ఆమె తన చాంబర్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో బాధ్యతల స్వీకరణ పత్రంపై సంతకం చేశారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకత్వంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నూతన హైకోర్టు భవన సముదాయాన్ని నిర్మిస్తామని, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కొన్నిచోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలలో శాయశక్తులా పోరాడాయని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్లెట్ (శ్రీశైలం) నుంచి టన్నెల్ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.
కృష్ణా జలాల్లో సమాన వాటాను సాధించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు(గురువారం) పరిశీలించారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డుల ద్వారా పేదలందరికీ సన్న బియ్యం అందిస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాలుగు నెలల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరమ్మతు పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
వరిసాగులో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, వరి విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.