Home » V Hanumantha Rao
అంబర్‌పేట నియోజకవర్గం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని సర్వే నెంబర్ 563/1 లోని 6.23 ఎకరాల బతుకమ్మకుంట స్థలం ముమ్మాటికీ ప్రభుత్వ సీలింగ్ భూమేనని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Former MP V. Hanumantha Rao) అన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.
తెలుగు నేలమీద విరాజిల్లిన తొలి తరం సామ్యవాద, సంఘసంస్కరణ ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి... పరిటాల సరళా కుమారి. సామాజిక, ఆర్థిక రంగ విశ్లేషకుడిగా తెలుగు పాఠకులకు గణాంకాల విలువలను తెలిపిన ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు సతీమణి. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా తమ జీవిత విశేషాలను సరళా కుమారి ‘నవ్య’తో పంచుకున్నారు.
తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు పాత్ర చాలా ప్రత్యేకమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఎంపీ, బీజేపీ నేత కంగనా రనౌత్(Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వి. హనుమంతరావు(V Hanumantha Rao) మండిపడ్డారు.
జన్వాడ ఫామ్ హౌస్‌పై మాజీ ఎంపీ వి. హనుమంత రావు హాట్ కామెంట్స్ చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రామంతపూర్ చెరువు, బతుకమ్మ కుంట చెరువు కూడా ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు చేశారు.
Telangana: ‘‘నాకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతా’’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు.
మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రధాని మోదీకిధ్యానమెందుకని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. మత విద్వేషాలు సృష్టించే ఆయన మూడ్రోజుల పాటు ఽధ్యానం చేయడంతో వచ్చే ప్రయోజనమేం లేదని వ్యాఖ్యానించారు. మోదీని దేవదూతగా అభివర్ణిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారన్నారు. రజాకార్ల పాట ఎన్ని రోజులు పాడతారని అన్నారు. రజాకార్లు ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు మాత్రమే మోదీ న్యాయం చేశారని విమర్శించారు.
Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. 25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామని చెప్పుకొచ్చారు.