VH: అమిత్ షా ఇప్పటికైనా తప్పును ఒప్పుకో.. లేదంటే
ABN , Publish Date - Dec 26 , 2024 | 02:48 PM
Telangana: కేంద్రమంత్రి అమిత్‌షాపై మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారతరత్నకు గౌరవం ఇస్తున్నాం అన్నప్పుడు అమిత్ షా అటువంటి వాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 26: జాతిపిత మహాత్మా గాంధీ (Mahathma Gandhi) సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అసమానత్వం, పేదలకు అన్యాయం జరుగుతుందని తెలుసుకున్నారని.. 1924 లో ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యారని మాజీ ఎంపీ హనుమంతరావు (Former MP V Hanumanth Rao) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. అహింస పద్ధతిలో స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర మహాత్మా గాంధీ పోషించారన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారతరత్నకు గౌరవం ఇస్తున్నాం అన్నప్పుడు అమిత్ షా అటువంటి వాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అంబేద్కర్ బలహీన వర్గాల దేవుడన్నారు. అంటరాని తనం నుంచి విముక్తి చేసేందుకు రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు అంబేద్కర్ అని చెప్పుకొచ్చారు.
YS Sharmila: విశాఖ స్టీల్ మోదీ దోస్తులకు అమ్మే కుట్ర.. షర్మిల సంచలన కామెంట్స్
ఇతరులు అంబేద్కర్‌ను అవమానిస్తే.. కేసులు పెట్టి జైల్లో వేసేవారన్నారు. కానీ హోం మంత్రి అమిత్ షా మీద చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఇప్పటికైనా తప్పు చేశానని ఒప్పుకొని క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద అవమానం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. అమిత్ షా మీద ఎస్సి, ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దీని మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ మాట్లాడటం లేదన్నారు.
మెగాస్టార్ రాకపోవడానికి రీజన్ ఇదే..
సంధ్య థియేటర్ ఘటన గురించి బీజేపీ ఐటీ సెల్‌లో పని చేసే వ్యక్తి చెప్పిన వ్యాఖ్యలపై వీహెచ్ అభ్యంతరం తెలిపారు. హీరో అల్లు అర్జున్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడని తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ కల్చర్ కాదని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చడమే లక్ష్యమని అన్నారు. కుల గణన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని వీ. హనుమంతరావు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News