Share News

VH: రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా తీసుకోలేదన్న మాజీ ఎంపీ..

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:10 PM

Telangana: ‘‘నాకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతా’’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు.

VH: రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా తీసుకోలేదన్న మాజీ ఎంపీ..
V Hanmanth Rao

హైదరాబాద్, ఆగస్టు 14: ‘‘నాకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతా’’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Former MP V Hanmanth Rao) అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు. ‘‘నాకు రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు..నాకు పదవులు ముఖ్యం కాదు.. పార్టీ కోసం పని చేస్తా’’ అని స్పష్టం చేశారు.

Narayana: అదానికి ఇనుప కవచంలా మోదీ


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశానికి ప్రధాని కావాలనేదే తన ఏకైక లక్ష్యమన్నారు. నిన్న ఏఐసీసీ మీటింగ్‌లో (AICC Meeting) సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ, మల్లి కార్జున ఖర్గే లు కులగణన చేయాలని చెప్పారన్నారు. కులగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆలోచన అని చెప్పుకొచ్చారు. 1931 లో కులగణన జరిగిందని... మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదన్నారు.

Jagan Viral Photo: భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్


బీజేపీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగణన చేయాలంటున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన బిల్ పెట్టారన్నారు. కులగణన కోసం రూ.150 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించారన్నారు. ఓబీసీ ఎంపీల కన్వీనర్‌గా కోట్లాడి ఐఐటీ, ఐఐఎమ్‌లలో రిజర్వేషన్‌ను తీసుకొచ్చానని తెలిపారు. ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయని హనుమంతరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. ముమ్మర ఏర్పాట్లు

Ponnam: గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 04:22 PM