Home » Vande Bharat Express
చెన్నై-నాగర్‌కోయిల్ మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే వర్గాలు తెలిపాయి. దేశ ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ జూన్ 20వ తేది నగరానికి వస్తారని ప్రకటించారు.
వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో తిరిగే రెండు వందే భారత్ రైళ్లతోపాటు రామేశ్వరం - పాంబన్(Rameshwaram - Pamban) వంతెనను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ రైలు వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. సిబ్బంది చెంప మాత్రం చల్లుమంది. అందుకు కారణం.. వెజ్ ఫుడ్‌కి బదులు నాన్ వెజ్ సర్వ్ చేయడం. తొందరలో ఫుడ్ ఆర్డర్ చూసుకోక పోవడం అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ తిన్న కస్టమర్ కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఆ రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశారు.
ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించిన అటల్ వంతెనకు పగుళ్లు రావడం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టర్మినల్ 1 విరిగిపడటం, అయోధ్యలో నీరు లీక్ కావడం, బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలడం.. ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.
మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంకానుంది.
త్వరలో వందే మెట్రోరైలు(Vande Metro Rail) నడుపనున్నట్లు ఐసిఎఫ్ అధికారులు తెలిపారు. పెరంబూర్ ఐసిఎఫ్ కర్మాగారం(Perambur ICF Plantలో తొలిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసే వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభించింది.
వందేభారత్ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.