Share News

Passenger Slaps: వందే భారత్ స్టాఫ్‌కు దబిడి.. దిబిడే..!!

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:45 PM

వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ రైలు వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. సిబ్బంది చెంప మాత్రం చల్లుమంది. అందుకు కారణం.. వెజ్ ఫుడ్‌కి బదులు నాన్ వెజ్ సర్వ్ చేయడం. తొందరలో ఫుడ్ ఆర్డర్ చూసుకోక పోవడం అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ తిన్న కస్టమర్ కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఆ రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశారు.

Passenger Slaps: వందే భారత్ స్టాఫ్‌కు దబిడి.. దిబిడే..!!
Passenger Slaps Vande Bharat Staff

వందేభారత్ రైలు (Vande Bharat Train) మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ రైలు వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. సిబ్బంది చెంప మాత్రం చల్లుమంది. అందుకు కారణం.. వెజ్ ఫుడ్‌కి బదులు నాన్ వెజ్ సర్వ్ చేయడం. తొందరలో ఫుడ్ ఆర్డర్ చూసుకోక పోవడం అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ తిన్న కస్టమర్ కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఆ రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.


ఏం జరిగిందంటే..?

వందేభారత్ సిబ్బందితో ప్రయాణికుడికి ఈ నెల 26వ తేదీన గొడవ జరిగింది. హౌరా నుంచి రాంచీ వెళుతోన్న రైలులో ఓ ప్రయాణికుడు వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. అతనికి నాన్ వెజ్ ఫుడ్‌ సర్వర్ అందజేశాడు. ఆ ఫుడ్ ఏంటి అని ఆ ప్యాసెంజర్ చూడలేదు. కనీసం లేబుల్ కూడా తీయలేదు. ఆర్డర్ ఓపెన్ చేసి తినడం ప్రారంభించాడు. తింటుండగా నాన్ వెజ్ అని సందేహాం కలిగింది. ఇంకేముంది తనకు ఫుడ్ సర్వ్ చేసిన సిబ్బందిని పిలిచాడు.


వెజ్ బదులు నాన్ వెజ్

సర్వర్‌ని పిలిచి ఫుడ్ విషయం అడిగాడు. వెజ్ ఇవ్వాల్సింది నాన్ వెజ్ ఎందుకు ఇచ్చావని కొశ్చన్ చేశాడు. అలా మాట్లాడుతూనే సదరు ప్యాసెంజర్ ఊగిపోయాడు. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న కునాల్ వర్మ అనే ప్యాసెంజర్ ఘటనను వీడియో తీశాడు. మిగతా ప్యాసెంజర్స్ ఆ ప్రయాణికుడి తీరును తప్పు పట్టారు. ఏదో తప్పు జరిగి ఫుడ్ వస్తే మాత్రం ఇలా చేయాలా..? కొట్టాలా..? అని అడిగారు. సదరు ప్రయాణికుడి తీరును తప్పుపట్టారు. వెంటనే సిబ్బందికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


తప్పు జరిగింది.. కానీ

ఫుడ్ విషయంలో తప్పు జరిగిందని సర్వర్ అంగీకరించాడు. క్షమించాలని వేడుకున్నాడు. అతనిని వదిలేస్తే సరిపోయేది. కంటిన్యూగా అతనిపై దాడి చేయడం సరికాదు. ఘటన జరిగిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు. దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పు పట్టారు.


Read More National News
and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 12:46 PM