Home » Varanasi
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి ఆయన పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్‌లో నమో ఘాట్‌కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
ఉత్తరప్రదేశ్: లోక్ సభ ఎన్నికల(Loksabha elections 2024) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(Varanasi)లో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సోమవారం దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీన వారణాసి నుంచి ప్రధాన మంత్రి నామినేషన్ వేయనుండటంతో దీనికి ముందుగానే ఆయన కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం వారణాసి లోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద జరిగిన 'గంగా హారతి'లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన నామినేషన్ వేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. మే 13వ తేదీ ఆయన నామినేషన్ వేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
మహాదేవ్ భక్తులకు(devotees) గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం IRCTC దేవ్ దర్శన్ యాత్ర(dev darshan yatra)ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కారు మార్చి 19న చోరీకి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలో చోరీకి గురైన కారు ఆదివారం వారణాసిలో ప్రత్యక్షమైంది. నడ్డా భార్య మళ్లికాకు చెందిన ఫార్చునర్ ఎస్యూవీ కారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోరీకి గురైంది.
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు.
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి.