Home » Vasi Reddy Padma
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై.. అలాగే మహిళా హోంమంత్రి, రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని, పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుండి మహిళలను కాపాడలేమని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తమకు ఆప్తులు అని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అనంతరం ఆమె వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డికి మహిళల మీద గౌరవం లేదన్నారు. మహిళల అభ్యున్నతికి ఆయన ఎప్పుడు పాటు పడలేదని చెప్పారు. ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై స్పందించలేదని గుర్తు చేశారు. ఆయనే కాదు.. అప్పటి హోం శాఖ మంత్రి సైతం స్పందించలేదంటూ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా వైఎస్ జగన్ పాలనను విమర్శించారు.
మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్‌కు చులకన భావం. వలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా?
నాలుగు రోజుల క్రితం అదృశ్యమై.. ఆదివారం అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన దళిత బాలిక ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు.