Share News

Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:06 PM

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై.. అలాగే మహిళా హోంమంత్రి, రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని, పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుండి మహిళలను కాపాడలేమని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ

అమరావతి: సోషల్ మీడియా (Social Media)లో మహిళల (Womens) పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిల్ వేయాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) జాతీయ మహిళా కమిషన్‌ను (National Commission for Women) కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె అమరావతి (Amaravati)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కుటుంబాలపై.. అలాగే మహిళా హోంమంత్రి (Home Minister), రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని, పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేమని అన్నారు. సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలని ఎన్సీడబ్ల్యూ (NCW) కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తక్షణమే జాతీయ మహిళా కమిషన్ సుప్రీం కోర్టులో పిల్ వేసి కఠినమైన చట్టం అమలుకు పూనుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు.


కాగా గత జగన్ ప్రభుత్వ హయాంలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్‌‌గా విధులు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని వైఎస్ జగన్ స్థాపించిన అనంతరం ఆ పార్టీలో ఆమె చేరారు. నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే వాసిరెడ్డి పద్మ వైఎస్సార్‌సీపీకి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన అనంతరం వైఎస్ జగన్‌పై కీలక ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి మహిళల మీద గౌరవం లేదని, మహిళల అభ్యున్నతికి ఆయన ఎప్పుడు పాటు పడలేదని విమర్శించారు. ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై స్పందించలేదని గుర్తు చేశారు. ఆయనే కాదు.. అప్పటి హోం శాఖ మంత్రి సైతం స్పందించలేదంటూ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా వైఎస్ జగన్‌ పాలనను విమర్శించారు.


ఇక తాను ప్రజలతోనే ఉంటానని.. రాజకీయంగా మాట్లాడుతూ.. రాజకీయంగా ఉంటానని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. రాజకీయాలు వదిలే ప్రసక్తే లేదని.. రాజకీయాల ముసుగులో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడతానన్నారు. వైసీపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. జగన్ కుటుంబంలో అసంతృప్తి లేదా.. ఆయన ప్రక్కన వన్ , టూ, త్రీగా ఉన్నవారికి అసంతృప్తి లేదా.. అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. అవకాశం వస్తే జగన్ నుంచి వెయ్యి కి.మీ. దూరం పారిపోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు ధైర్యంతో ముందుకు అడుగువేయాలన్నారు. రాజకీయాల్లో ఉన్పప్పుడు నాయకుడు ఎలా ఉండాలో ముందు జగన్ నేర్చుకోకుండా.. పార్టీని నడపం అనేది రాష్ట్రానికి ప్రమాదమని తాను భావిస్తున్నాననని.. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని వాసిరెడ్డి పద్మ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ సోదాలు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 08 , 2024 | 12:06 PM