Vasireddy padma: పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డ వాసిరెడ్డి పద్మ

ABN , First Publish Date - 2023-07-27T16:30:10+05:30 IST

మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్‌కు చులకన భావం. వలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా?

Vasireddy padma: పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డ వాసిరెడ్డి పద్మ

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)పై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి (Vasireddy padma) పద్మ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు అంటూ మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ‘‘మహిళల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారు. దానిపై పవన్ కామెంట్స్ చేశారు. మహిళల అదృశ్యంలో దేశంలో ఏపీ 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదు. ఏపీలో మహిళల అదృశ్యంపైనే రాజ్యసభ ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోంది. ఏపీనే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, వలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటున్నారు. ప్రేమ వ్యవహారాల వలనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా? తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదు?, పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి.’’ అని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు.

‘‘మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్‌కు చులకన భావం. వలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా?, వలంటీర్ల క్యారెక్టర్‌పై మాట్లాడుతున్నారు గనుక మేం కూడా ప్రశ్నిస్తున్నాం. మహిళల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి, మాకు ఎంతో చిత్తశుద్ధి ఉంది. 2014-19 వరకు టీడీపీ, జనసేన భాగస్వామ్య ప్రభుత్వమే. అప్పుడు ఎందుకు మహిళల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు?, మహిళలు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా పథకాలు పొందుతున్నారు. అంత గౌరవంగా, హక్కుగా మహిళలు పథకాలు పొందుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తుంటే వారిని అవమానిస్తారా?.’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘చీరలు పంచుతామని పిలిచి చావులకు కారణం అయ్యారు. మహిళలకు మీరు, మీ పార్ట్‌నర్ ఇచ్చే గౌరవం ఇది. ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా?, మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనిపిస్తే.. ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పటం లేదు?, ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అంటాడు. సినీ రాజకీయ నాయకుల తీరుపై చర్చ జరగాలి. రాష్ట్రానికే కట్టప్పల్లా వ్యవహరిస్తున్నారు. మహిళా కమిషన్‌కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉంటే పొగడకుండా ఎలా ఉంటాం?, ఆడవాళ్ళతో ఆడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మహిళా కమిషన్ ఓపెన్ ఛాలెంజ్. మహిళల సమక్షంలో రచ్చబండకు పవన్ కళ్యాణ్ రావాలి.’’ అని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-07-27T16:30:10+05:30 IST