Home » Virat Kohli Records
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో(London) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు వామికతో(Vamika) కలిసి లండన్‌లో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా - ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు.
భారత్, అఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మొహాలీ వేదికగా గురువారం రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఏకంగా 146 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Virat Kohli: సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డులను సాధిస్తుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
Virat Kohli: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో 50+ రన్స్ చేస్తూ పరుగుల వరదపారిస్తున్నాడు. 500కుపైగా పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఏకంగా 108 సగటుతో 543 పరుగులు చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో చెలరేగాడు. ఒక పాకస్థాన్‌తో మ్యాచ్ మినహా మిగతా నాల్గింటిలో కోహ్లీ చెలరేగాడు. ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో ఏకంగా 354 పరుగులు బాదేశాడు.
ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్), విరాట్ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు 13,921 పరుగులు చేశాడు.