Home » Visa
రెండు వేల వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇవి ‘బాట్స్’ను ఉపయోగించి మోసపూరితంగా పొందిన అపాయింట్‌మెంట్లుగా గుర్తించినట్లు ఎక్స్ లో పేర్కొంది.
ప్రతిభ ఉన్న నిపుణుల కోసం అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలో H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. అయితే దీని కోసం ఎప్పటివరకు గడువు ఉంది, ఫీజు వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
US Citizenship for Sale : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బహిష్కరించారు. అమెరికా శాశ్వత పౌరసత్వం కష్టంగా మారిన తరుణంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. అసలేంటి కార్డు.. భారతీయులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది..
వీసాల పేరుతో రూ.కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ దేశాలకు వెళ్లేందుకు వీసాలు సమకూరుస్తామని నమ్మించి 51మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్(City Police Commissioner Dayanand) పేర్కొన్నారు.
మనిషి జీవనయానంలో ఎన్నో మజిలీలు. ఉద్యోగ విరమణ అయిన తర్వాత గడిపే కాలాన్ని ‘గోల్డెన్ ఇయర్స్’ అంటారు. ఎందుకంటే ఆదరాబాదరా లేకుండా, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదిస్తూ, తమకోసం తాము జీవించే బంగారు కాలం అదే కాబట్టి. గోల్డెన్ ఇయర్స్‌లో ఉన్నవారికి ‘రిటైర్మెంట్ వీసా’ ఇస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి కొన్ని దేశాలు. సోషల్ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్.
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎ్‌ససీఐఎస్) ప్రకటించింది. మార్చి 7 నుంచి 24 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.
ప్రస్తుతం అమెరికాలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న భారతీయులకు శుభవార్త. ఐటీ ఉద్యోగులకు ఓ దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు తమ దేశానికి వచ్చి పనిచేసేందుకు వీలుగా వీసా నిబంధనలను సడలించింది..
రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ చెప్పారు.
అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా క్రమంగా బలహీనపడుతోంది.
పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ ప్రయాణీకులను తమ దేశానికి రప్పించేందుకు వీసా నిబంధనలు సవరించింది. చైనా తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం 54 దేశాలకు వర్తిస్తుంది. ఈ విషయం పర్యాటక ప్రియులకు వీనులవిందే. మరి, ఈ దేశాల జాబితాలో భారత్ ఉందా?..