Donald Trump Gold Card : ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్.. డబ్బు చెల్లిస్తే ఎవరికైనా అమెరికా పౌరసత్వం..
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:13 PM
US Citizenship for Sale : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బహిష్కరించారు. అమెరికా శాశ్వత పౌరసత్వం కష్టంగా మారిన తరుణంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. అసలేంటి కార్డు.. భారతీయులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది..

US Citizenship for Sale : డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా పౌరసత్వం పొందడం కష్టమైంది. అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి మరీ స్వదేశాలకు తిప్పి పంపడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంతలోనే, ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. ఈ మొత్తం చెల్లిస్తే ఏ దేశం వారికైనా పౌరసత్వం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రత్యేక కార్డుతో యూఎస్‌లో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా. ఈ నిర్ణయం వరమా.. శాపమా..
గోల్డ్ కార్డు వీసా అంటే..
ప్రస్తుత ఉన్న EB-5 వీసా ప్రోగ్రాంకు బదులుగా ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ప్రతిపాదించారు. ఈ పథకం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరికైనా 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.43.54 కోట్లు చెల్లిస్తే పౌరసత్వం లభిస్తుంది. ప్రధానంగా విదేశీ సంపన్నులను ఆకర్షించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు ట్రంప్. అయితే, యూఎస్ గ్రీన్ కార్డు పొందాలని కోరుకునే విదేశీయులు ఈ నియమం తప్పక పాటించాలి. కనీసం 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి ఉపాధిని సృష్టించినవారికే నేరుగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. గతంలో EB-5 వీసా ప్రోగ్రాం కింద కనీసం 8 లక్షల డాలర్లు పెట్టుబడి, 10 ఉద్యోగాలు సృష్టించాలనే నిబంధనే ఉండేది.
భారతీయులకు నష్టమా.. లాభమా..
అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేలమంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఈబీ-5 ప్రోగ్రాం స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురావడంతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎలాగోలా రుణాలు చేసి సామాన్య ఇన్వెస్టర్లు ఈబీ-5 ప్రోగ్రాంకు అర్హత పొందేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నా అధిక మొత్తం పెట్టి కార్డు కొనే పరిస్థితి లేదు. కానీ, అమెరికా కల నెరవేర్చుకోవాలనే రిచ్ ఇండియన్స్‌కు ట్రంప్ ఆఫర్ మేలు చేకూర్చనుంది.
మరో రెండు వారాల్లో ఈబీ-5 ప్రోగ్రాంను గోల్డ్ కార్డు భర్తీ చేయనుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుథ్నిక్ స్పష్టం చేశారు. ఎన్ని కార్డులు జారీ చేస్తారనే దానిపై పరిమితి విధించలేదు. త్వరలో 10 లక్షల కార్డులు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : Gaza: గాజా ఏఐ వీడియో షేర్ చేసిన ట్రంప్.. బాంబుల మోత టూ బంగారం..
Virat Kohli: మళ్లీ టాప్‌లోకి కోహ్లీ.. రోహిత్‌కే స్పాట్ పెట్టాడుగా..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..