Home » Visakhapatnam
విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Andhrapradesh: మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మేఘాల కొండకు బ్రేక్ పడింది...
Andhrapradesh: పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గుంతలు లేని రోడ్లకు నేడు (శనివారం) అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కోసం గత ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విషయంలో వివాదం చెలరేగుతోంది. పీవీ సింధుకు ఇచ్చిన స్థలంలో జూనియర్ కాలేజ్‌ను ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు పట్టుబడుతున్నారు.
Andhrapradesh: మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్‌ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు తీరట్లేదు. జిల్లాల విభజన జరిగి పరిపాలన చేరువైనా.. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు.
Andhrapradesh: అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీని తీర్చిదిద్దుతామని 20 పాయింట్ల చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.
Andhrapradesh: రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీపై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టూరిజంకు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు.