Share News

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:38 AM

Andhrapradesh: బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ కోసం గత ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విషయంలో వివాదం చెలరేగుతోంది. పీవీ సింధుకు ఇచ్చిన స్థలంలో జూనియర్ కాలేజ్‌ను ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు పట్టుబడుతున్నారు.

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధు స్థల వివాదం
Badminton player PV Sindhu

విశాఖపట్నం, అక్టోబర్ 28: నగరంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు (Badminton player PV Sindhu) కేటాయించిన స్థలం వ్యవహారంలో వివాదం చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌కు గత ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా తోటగురువులో స్థలాన్ని అకాడమీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ స్థలంపై ప్రస్తుతం స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో జూనియర్ కాలేజ్ నిర్మించాలంటూ వారు నిరసనకు దిగారు. జూనియర్ కాలేజ్ కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు స్థానికులు కోరారు. ఖచ్చితంగా ఆ స్థలాన్ని జూనియర్ కాలేజ్‌కు కేటాయించాలని స్థానికులు పట్టుబడుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, ఇటు బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Rohit Sharma: రోహిత్ శర్మ లైట్ తీసుకోడు: రవిశాస్త్రి



ఎప్పుడు కేటాయించారంటే...

2021, జూన్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం పీవీ సింధుకు విశాఖలో రెండు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్ప్రోట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు గాను పీవీ సింధుకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖ రూరల్ మండలం చినగదిలి మండలంలో 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయించింది. అకాడమీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడమే కాకుండా నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీకి బదలాయించాలని కూడా నిర్ణయించారు. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని వినియోగించాలని, కమర్షియల్‌ అవసరాల కోసం వినియోగించకూడదని ఉత్తర్వుల్లో అప్పటి సర్కార్ స్పష్టంగా పేర్కొంది.

jagan-sindhu.jpg

Chennai: మాజీ సీఎం మిత్రుడికి ఐటీ షాక్‌.. రూ.42 కోట్ల నగదు స్వాధీనం


ప్రభుత్వ నిర్ణయంపై పీవీ సింధు హర్షం వ్యక్తంచేశారు. అకాడమీకి స్థలం కేటాయించినందుకు గాను అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్‌ అకాడమీ లేదని.. అందుకే అక్కడ అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించాని.. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. తొలి దశలో అకాడమీ నిర్మిస్తామని.. తర్వాతి దశలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్పారు. తానింకా ఆడుతున్నందుకు.. రిటైర్మెంట్ అయ్యాక అకాడమీలో శిక్షణ బాధ్యతలు చేపట్టనున్నట్లు పీవీ సింధు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పీవీ సింధుకు కేటాయించిన స్థలాన్ని జూనియర్ కాలేజీకి కేటాయించాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి...

వాళ్లందరినీ ముక్కలుగా నరికేస్తాం: మిథున్‌

Kollu Ravindra: మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2024 | 03:21 PM