Lankadinakar: వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రనే వారి లక్ష్యం
ABN , Publish Date - Oct 26 , 2024 | 01:15 PM
Andhrapradesh: అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీని తీర్చిదిద్దుతామని 20 పాయింట్ల చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబర్ 26: గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అధ:పాతాళంలోకి వెళ్లిపోయిందని, కొత్త పరిశ్రమల స్థాపన, పెట్టుబడులపై దృష్టి పెట్టలేదని 20 పాయింట్స్ చైర్మన్ లంకా దినకర్ (20 Points Chairman Lanka Dinakar) విమర్శలు గుప్పించారు. శనివారం వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఏపీ టూర్ అండ్ ట్రావెలర్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో లంకా దినకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర.. ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) లక్ష్యమని అన్నారు.
TDP: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంతో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమల పునరుద్ధరణ కోసం త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వలన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. దేశానికి ముంబాయి ఎలాగో.. ఏపీకి ఆర్థిక రాజధాని విశాఖ అని లంకా దినకర్ పేర్కొన్నారు.
అందరూ సహకరించండి: ఎంపీ భరత్
వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఏపీ టూర్ అండ్ ట్రావెలర్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విశాఖ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పెట్టుబడుల పాలసీలు, అవకాశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు వినే ప్రభుత్వం వచ్చిందన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జీవీఎంసీ వద్ద నిధులు లేవని... నగరంలో సీసీ కెమెరా ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడానికి ముందుకు రావాలన్నారు. విశాఖ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎంపీ భరత్ కోరారు. ఈ సదస్సులో ఎమ్ ఎస్ ఎమ్ ఈ చైర్మన్ శివ శంకర్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..
Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం
Read Latest AP News And Telugu News