Home » Vizag News
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ( ఈ రోజు) విశాఖపట్టణం వెళతారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ వస్తారు. మూడు రోజులపాటు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు విశాఖ పెందుర్తి నియోజకవర్గం, పురుషోత్తపురంలో, శంఖారావం సభ నిర్వహించారు.
రాబోయే ఎన్నికల్లో మళ్లీ భీమిలి నుంచే పోటీ చేస్తానని.. ఆ నియోజకవర్గంలో తాను గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) తెలిపారు. గతంలో రెండు సార్లు కూడా భీమిలి నుంచే పోటీ చేశానని గుర్తుచేశారు. భీమిలీలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు.
వైసీపీ నేతల తీరుపై సీఎం జగన్ (CM Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు కార్యక్రమానికి జనం తక్కువగా రావడంపై మండిపడ్డారు.
క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ పోటీల ద్వారా వెలికితీశామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan) తెలిపారు. మంగళవారం ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు.
విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ఆరోపించారు.
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.
‘‘అందరి తలరాత దేవుడు రాస్తే.. నా తలరాతను సీఎం జగన్(CM Jagan) రాస్తారని... ఆయనకు నేను నమ్మిన బంటునని.. అతను తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా నేను కట్టుబడి ఉంటా’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.