Home » Warangal News
కేంద్రంలో బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) అన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.
వరంగల్‌లో ఓ ‘లవ్ స్టోరీ’ విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా..
నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు పలు అక్రమాలకు కేంద్రంగా మారింది. రింగ్ రోడ్డు ప్రాంతం నిర్మానుషంగా ఉండటంతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్చగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రధానంగా కేయూ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ ఆర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) హాట్ కామెంట్స్ చేశారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట(Wardhanapet) నియోజకవర్గం జనరల్ కాబోతోందని..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
వరంగల్(Warangal) లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కోసం బీఆర్ఎస్(BRS) అన్వేషణ సాగిస్తోంది. కాంగ్రెస్(Congress), బీజేపీలకు(BJP) దీటుగా నిలబడే బలమైన అభ్యర్థి కావాలంటూ అధిష్ఠానం ఆశావహుల జాబితాను వడపోస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత కడియం కావ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసినా.. అనూహ్యంగా ఆమె బీఆర్ఎ కు రాజీనామా చేసి..
బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు.
నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్లో మంటలు ఎగసి పడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. రెండు, మూడో ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకి ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు ఒక్కక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇదే కోవలో బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ (MP Pasunoori Dayakar) బీఆర్ఎస్కు రాజీనామా చేసి హై కమాండ్‌కు పంపించారు.