Telangana Politics: రేవంత్ రెడ్డి నా శిష్యుడే.. ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్..
ABN , Publish Date - May 10 , 2024 | 03:21 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) హాట్ కామెంట్స్ చేశారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట(Wardhanapet) నియోజకవర్గం జనరల్ కాబోతోందని..
వరంగల్, మే 10: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) హాట్ కామెంట్స్ చేశారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట(Wardhanapet) నియోజకవర్గం జనరల్ కాబోతోందని.. వర్ధన్నపేటకు మళ్లీ తానే వస్తానని అన్నారు. ‘వర్ధన్నపేట దయన్న అడ్డా.. ఇకపై ఇక్కడే ఉంటా..’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని.. మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారన్నారు. అయినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. ఇక చేసేది లేక వైఎస్ఆర్ తన వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఏడవటంతో సెంటిమెంట్‌తో ఆమెను గెలిపించారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
కార్యకర్తల జోలికొస్తే ఉరికిస్తాం..
అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కాపాడుకున్నానని.. ఇప్పుడు కూడా కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకోనని అధికార పార్టీని ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. కాంగ్రెస్ శ్రేణులు తమ కార్యకర్తల్లో ఒక్కరి జోలికి వచ్చినా.. వందమందిని ఉరికిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు దయకార్ రావు. కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తే భయపడే స్థితిలో లేమన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఉరికిస్తామని హెచ్చరించారు.
రేవంత్ నా శిష్యుడే..
సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని.. ఆయన ఎప్పుడు స్థిరంగా ఉండడని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయితే.. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనకో పదవి ఇస్తానంటున్నారని.. ఆ విషయంపై ఆలోచిస్తున్నానని అన్నారు ఎర్రబెల్లి. ఇదే సమయంలో కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు దయాకర్ రావు. కడియం శ్రీహరి పెద్ద మోసకారి అని విమర్శించారు. చంద్రబాబును, కేసీఆర్‌ను కూడా మోసం చేశాడని ఆరోపించారు. కడియం శ్రీహరి విశ్వాసఘాతకుడు అని దుయ్యబట్టారు. ఇక తాను ఎప్పుడూ చంద్రబాబును, ఎన్టీఆర్‌ను తిట్టలేదని చెప్పారు ఎర్రబెల్లి. తెలంగాణలో సంవత్సరం లోపు అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయం అని దయాకర్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.