Home » Weather
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, గుజరాత్ మధ్య ఈ రోజు కీలక మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే.
Hyderabad Rains: ఒక రోజు వర్షం.. రెండు రోజులు ఎండ.. మరో రెండు రోజులు ఉక్కపోత.. ఆపై మళ్లీ వర్షం.. ఇదీ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొన్న వాతావరణ పరిస్థితి. గతం వారం రోజులుగా వర్షం, ఎండ, ఉక్కపోత గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరమంతా చల్లటి వాతావరణం నెలకొంది.
దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అంచనాల
దక్షిణ కర్ణాటక పరిసరాల్లో ఆవర్తనం ఆవరించింది. దాని నుంచి మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.
తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో రానున్న 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 4 జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రేపు భద్రాది కొత్తగూడం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతాచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఈ వేసవిలో భానుడి తాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 14వ తేదీ వరకు తేలికపాటి..
తెలంగాణ(telangana)లో 5 రోజులు మోస్తరు వర్షాలు(rains) కురుస్తాయని హైదరాబాద్(hyderabad) వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు విదర్భ, మహారాష్ట్ర, తమిళనాడులలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అకాల వర్షంతో చిగురుటాకుల వణికిన తెలంగాణ జిల్లాలకు భారత వాతావరణ శాఖ(IMD) అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. మే 8, 9 తేదీల్లో కూడా వేర్వేరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Telangana Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఒకే ఒక వర్షం.. హైదరాబాద్ను(Hyderabad) అతలా కుతలం చేసింది. అసలే ఉద్యోగుల పని వేళలు ముగిసి ఇంటికి బయలుదేరే సమయం. ఈ సమయంలో భారీ వర్షం(Heavy Rains) భాగ్యనగరాన్ని ముంచెత్తింది. రోడ్లపై చేరిన వర్షపు నీటితో రవాణా వ్యవస్థ(Public Transport) స్తంభించిపోయింది.