Remal Cyclone: రెమాల్ సైక్లోన్ ఎఫెక్ట్.. 394 విమానాలు, పలు రైళ్లు రద్దు
ABN , Publish Date - May 26 , 2024 | 02:25 PM
'రెమాల్(Remal)' తుపాను ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు విమానాలతోపాటు రైళ్లను కూడా రద్దు చేశారు.
రెమాల్ తుపాను (Remal Cyclone) ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు రుతుపవనాలు ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో తుపానుగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. రెమాల్ ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిందని ఆదివారం ఉదయం 8 గంటలకు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖేపుపారాకు దక్షిణ-ఆగ్నేయంగా 290 కి.మీ, దక్షిణాన 270 కి.మీ దూరంలోని సాగర్ ద్వీపం ఆగ్నేయంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
ఇది మరింత బలపడి అర్ధరాత్రి నాటికి పశ్చిమ బెంగాల్, సాగర్ ద్వీపం, ఖెపుపరా మధ్య బంగ్లాదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మే 27-28 తేదీలలో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
తుపాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు 1.5 మీటర్ల ఎత్తులో అలల వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. మరోవైపు ఈ తుపాను నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కోల్‌కతా(kolkata) విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు పలు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయంగా 394 విమానా సర్వీసులను(flights) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు పలు రైళ్లను(trains) కూడా రద్దు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు.
రద్దైన రైళ్లలో రైలు నంబర్ 22897 (హౌరా-దిఘా కందారి ఎక్స్‌ప్రెస్) మే 26న నడవదు
రైలు నంబర్ 08137 (పాన్స్‌కుర-దిఘా EMU ప్యాసింజర్ స్పెషల్) మే 26న నడపబడదు
రైలు నంబర్ 08139 (పాన్స్‌కుర-దిఘా EMU ప్యాసింజర్ స్పెషల్) మే 26న నడపబడదు
రైలు నంబర్ 22898 (దిఘా-హౌరా కందారి ఎక్స్‌ప్రెస్) మే 26న నడవదు
రైలు నంబర్ 08136 (దిఘా-పాన్స్‌కుర EMU ప్యాసింజర్ స్పెషల్) మే 27న నడవదు
రైలు నంబర్ 08138 (దిఘా-పాన్స్‌కుర స్పెషల్) EMU మే 27న పనిచేయదు
రైలు నంబర్ 22889 (దిఘా-పూరీ సూపర్‌ఫాస్ట్ వీక్లీ రైలు) మే 26న దిఘాకు బదులుగా ఖరగ్‌పూర్ నుంచి నడుస్తుంది
ఇది కూడా చదవండి:
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest News and National News here