Share News

Telangana Weather: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షానికి ఛాన్స్..

ABN , Publish Date - May 27 , 2024 | 09:41 PM

AP and TG Weather Updates: తెలంగాణలో విచిత్ర వాతావరణం ఉంది. కాసేపు ఎండలు దంచుతుండగా.. మరికాసేపు ఈదురు గాలులు, వడగళ్ల వానతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.

Telangana Weather: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షానికి ఛాన్స్..
Weather Updates

AP and TG Weather Updates: తెలంగాణలో విచిత్ర వాతావరణం ఉంది. కాసేపు ఎండలు దంచుతుండగా.. మరికాసేపు ఈదురు గాలులు, వడగళ్ల వానతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మంగళవారం నాడు హైదరాబాద్‌తో పాటు.. పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం నాడు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. నల్లగొండ, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.


ఏపీలోనూ జోరుగా వానలు..

రెమాల్ తుపాను ప్రభావంతో ఏపీలోనూ జోరుగా వానలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నాడు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన గాలుల కారణంగా ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. రక్షణ గోడ పైనుంచి రోడ్డుపైకి అలలు దూసుకొచ్చాయి. మంగళవారం రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ఈదురుగాలులు భారీగా వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 27 , 2024 | 09:41 PM