Home » Yadadri Bhuvanagiri
గత బీఆర్ఎస్ సర్కారు పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన నష్టం, ఈ అంశాల్లో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన బహిరంగ ప్రకటనకు... కేవలం ఆరుగురు మాత్రమే స్పందించారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం కోలాహలంగా మారింది. వేసవితో పాటు వారాంతపు సెలవు కలిసి రావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద ్దసంఖ్యలో తరలివచ్చారు. 80వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా
‘‘మోసపోతే గోస పడతారని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినప్పటికీ వినలేదు. కాంగ్రె్‌సనే గెలిపించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా హత్యా రాజకీయాలు చేస్తోంది’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొంది. సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9.30 గంటలకు నిలిపివేశారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీ్‌సగఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో భాగస్వాములైన మొత్తం 28 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసులివ్వగా.. వారిలో 25 మంది దాకా అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానలిచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు పాంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి.
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..