Share News

Bhuvanagiri: యాదాద్రిలో భక్తజన సందోహం..

ABN , Publish Date - May 27 , 2024 | 04:26 AM

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం కోలాహలంగా మారింది. వేసవితో పాటు వారాంతపు సెలవు కలిసి రావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద ్దసంఖ్యలో తరలివచ్చారు. 80వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా

Bhuvanagiri: యాదాద్రిలో భక్తజన సందోహం..

  • నృసింహుడిని దర్శించుకున్న 80వేల మంది

  • ఆలయ ఖజానాకు రూ. 1.02 కోట్లు

భువనగిరి అర్బన్‌, బీబీనగర్‌ మే 26: లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం కోలాహలంగా మారింది. వేసవితో పాటు వారాంతపు సెలవు కలిసి రావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద ్దసంఖ్యలో తరలివచ్చారు. 80వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా వీఐపీ టికెట్‌(రూ.150) దర్శనానికి రెండున్నర గంటలు, ధర్మదర్శనానికి నాలుగు గంటల సమయం పట్టడంతో ఉభయ క్యూలైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వేళ బ్రేక్‌ దర్శనానికి(అసలు సమయం 4-5 గంటల మధ్య)... ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చి 40 నిమిషాలకు కుదించారు.


ప్రధానాలయం భక్తులతో కిటకిటలాడగా మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన షెడ్డు కింద భక్తులు అధిక సంఖ్యలో సేద తీరారు. రద్దీకి తగిన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎండలో నిరిక్షించాల్సి వచ్చింది. కాగా, ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.1,02,68,099 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావు తెలిపారు. మరోవైపు బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.


సెలవురోజు కావడంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, స్వర్ణగిరి దేవాలయం దైవ దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. దీంతో హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో రద్దీ తీవ్రంగా పెరగడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం టోల్‌ ప్లాజా దాటేందుకు దాదాపు 15 నిమిషాలు పట్టింది.


భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం, మే 26: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి గత రెండు రోజుల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం 15 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఆదివారం 20 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోవడం విశేషం. గత రెండు రోజులుగా భద్రాద్రి దేవస్థానానికి రూ.30,45,683 ఆదాయం సమకూరింది.

Updated Date - May 27 , 2024 | 04:26 AM