Home » Yadadri Temple
యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు.
గ్రంథ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్నిస్తుందని పేర్కొంటూ ఈ పవిత్ర గ్రంధాన్ని వేల ప్రతుల్లో ప్రచురించి మహా పుణ్య కార్యంగా భుజాలకెత్తుకున్న లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఎన్నెన్నో శ్రీవైష్ణవ ఆలయాలకు ‘ఉగ్రం వీరం’ను చేరుస్తున్న ప్రచురణకర్త లక్ష్మయ్య ఆత్మ సమర్పణాభావాన్ని అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సాంస్కృతిక, భక్తి కేంద్రాల్లో రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ఉగ్రం... వీరం’ పవిత్ర గ్రంధాన్ని ఏడుగురు ప్రముఖులచే...
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు పాంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి.
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.
‘శత్రు భయంకరం’.. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్‌చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్‌నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన పాపాలే.. ప్రస్తుతం ఆయన్ని చుట్టుముడుతోన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.