Home » Yanamala RamaKrishnudu
టీడీపీ అధినేత చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ యత్నిస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అసలు ఆర్థిక నేరస్థుడు ఎవరని యనమల ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి జగన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారన్నారు.
ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాయిష్ బ్యాంకు సర్వేలో ఏపీ ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11వ స్థానంకు దిగజారడానికి కారకులెవరని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానాం-యెదురులంక మధ్యనున్న జీఎంసీ బాలయోగి వంతెనపై ఓ పెంపుడు శునకం యజమాని కోసం తల్లడిల్లిపోయింది. రాత్రంతా అక్కడే ఉండి యజమాని కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. 8వ నంబర్ పిల్లర్ వద్ద నదిలోకి దూకిన యజమాని తిరిగి అక్కడికే వస్తుందని ఆమె చెప్పుల దగ్గరే అరుస్తూ ఉండిపోయింది.
అమరావతి: బీసీల విషయంలో సీఎం జగన్‌ది కొంగజపమని, తడిగుడ్డతో గొంతులు కోస్తూ.. తోడుగా ఉన్నాననడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
సహజవనరులను దోచుకోవడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విశాఖలో యనమల మాట్లాడారు. ‘‘విశాఖలో రెండు రకాలైన సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. ఒకటి శాంతియుత జీవనానికి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేవారు కొందరు. రెండో వారు ఇక్కడ ప్రజలను దోచుకోడానికి ప్రజలను భయపెట్టి లాక్కోవడానికి జరిగే సెటిల్మెంట్ చేసేవారు మరికొందరు.
సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు అయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఆర్థికస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు వస్తే.. తాము సిద్ధమని గతంలోనే చెప్పామని.. దానికి కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదని.. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.