Yanamala: నాలుగున్నరేళ్లలో విహారయాత్రలు తప్ప అభివృద్ధి శూన్యం.. జగన్‌పై యనమల ఫైర్

ABN , First Publish Date - 2023-10-12T12:54:14+05:30 IST

గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి విహారయాత్రలు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

Yanamala: నాలుగున్నరేళ్లలో విహారయాత్రలు తప్ప అభివృద్ధి శూన్యం.. జగన్‌పై యనమల ఫైర్

రాజమండ్రి: గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి విహారయాత్రలు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Former Minister Yanamala Ramakrishnudu) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేదవాడి పేరు చెప్పి వైసీపీ నేతలు రాష్ట్రంలో వనరులన్నీ దోచుకున్నారన్నారు. పేదవారికి ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం రంగులు మార్చేసిందన్నారు. పూర్తికాని ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేస్తూ పేద ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ అధికారంలో నుంచి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. పేదరికం తగ్గించగలిగావా..? అసమంతులను తగ్గించగలిగావా..? సూటిగా సమాధానం చెప్పు జగన్ అని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్ ది అని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 11 లక్షల కోట్లు దాటిపోయాయని.. 270 కోట్లు రుషికొండ క్యాంపు కార్యాలయం కోసం ఖర్చు పెట్టారన్నారు. జగన్ పాలనలో రెండు లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. వైసీపీ అవినీతిపై న్యాయ స్థానంలో పోరాటం చేయటంతో పాటు అవినీతిని కక్కిస్తామన్నారు. హౌసింగ్ నిర్మాణాలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-12T12:54:14+05:30 IST