Home » Yogi Adityanath
పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ(BJP) నోటీసులివ్వడం ఉత్తరప్రదేశ్(UP) రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే కుమారుడు, పార్టీ బహిష్కృత నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటమే నోటీసులు పంపడానికి కారణంగా తెలుస్తోంది. యూపీ ఫతేపూర్ సిక్రీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి కుమారుడు రామేశ్వర్ చౌదరి అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.
లఖ్నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్నవూ నగర పుర వీధుల్లో రాజ్నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 'షరియా చట్టం' తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress) అంటేనే ఉగ్రవాదం, స్కామ్లు, నక్సలిజానికి పర్యాయపదమని ఆరోపించారు.
మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి సర్వేష్ సింగ్(72) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొదటి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తరువాతి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
శారదీయ నవరాత్రి 'మహర్నవమి' పర్వదినం సందర్భంగా ఏటా సంప్రదాయబద్ధంగా చేసే 'కన్యాపూజ'ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోరఖ్నాథ్ ఆలయంలో నవరాత్రి తొమ్మిదో రోజు సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో తొమ్మిది మంది చిన్నారులకు కాళ్లు కడిగి వారికి తిలకం దిద్దారు.
సమాజానికి ముప్పు తెచ్చే నేరస్థులకు 'రామ్ నామ్ సత్య్ హై' (అంత్యక్రియలు) ఖాయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. మనిషి మృతదేహానని మోసేటప్పుడు వెంట వెళ్లేవారు 'రామ్ నామ్ సత్య్ హై' అంటూ నినదించడం అనేది హిందూ మత విశ్వాసాల్లో ఒకటిగా ఉంది.