Share News

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

ABN , Publish Date - May 16 , 2024 | 01:37 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌, ఆప్ నేత సంజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!
Arvind Kejriwal

లఖ్‌నవూ, మే 16: సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌, ఆప్ నేత సంజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను ప్రధాన మంత్రిని చేసేందుకు నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. రానున్న మూడు నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తారన్నారు.

TDP: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్


అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల తెగలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తారని స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీన అంటే.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి ఘటనపై స్పందించాలని విలేకర్లు కోరగా.. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నిరాకరించారు. కానీ విలేకర్ల అడిగిన ప్రశ్నపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. దేశంలో చాలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వాటిపై ప్రధాని మోదీ స్పందించడం లేదన్నారు.

అందులో మణిపూర్‌లో జరిగిన హింస కూడా ఉందన్నారు. అలాగే హాసన్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ అంశంపై కూడా ప్రధాని మోదీ మాట్లాడలేదని సంజయ్ సంగ్ గుర్తు చేశారు. అయితే ప్రజ్వల్ రేవణ్ణకు ఓటు వేయాలని ప్రధాని మోదీ కర్ణాటక ప్రజలకు విజ్జప్తి చేస్తున్నారన్నారు.

Rains: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..


ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, జేడీ(ఎస్) కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢీల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే జూన్ 2వ తేదీన లోంగిపోవాల్సి ఉంటుందని తన జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Latest National News And Telugu News

Updated Date - May 16 , 2024 | 01:37 PM