Home » YS Avinash Reddy
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వైసీపీ 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆ తరువాత మరో లోక్సభ అభ్యర్థిని ప్రకటించడంతో.. అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా కొన్ని అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. కడప లోక్ సభలో ప్రత్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన వారితో సంబంధాలు ఎందుకు ఉన్నాయని సూటిగా నిలదీశారు. హత్య జరిగిన సమయంలో చేసిన కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయని ప్రశ్నించారు.
ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..
Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్రెడ్డి వైపా..?..
కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.
తమ్ముడు వైఎస్ అవినాశ్ రెడ్డి కాగా, అన్నయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక ర్యాంపులు రాసిచ్చేశారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాశ్ రెడ్డికి చేసిన మేళ్లు ఏమిటో.. ‘దేవుడికీ, రాష్ట్ర
తన కుటుంబ సభ్యులకు సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ దస్తగిరి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ ఫ్యామిలి ఫైట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కడప వైసీపీ ఎంపీ అభ్యర్ధి వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ షర్మిల రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు షర్మిల కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.