Home » YS Sharmila
వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునువ్వు, ఆయన నడిస్తే రాజసం కొట్టొచ్చినట్టు కనపడేదని ఆయన కూతురు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయ పడ్డారు. వైఎస్ఆర్ ఏం చేయాలన్నా దైర్యంగా చేసేవారని గుర్తుచేశారు. నాన్న చనిపోవడానికి కొద్ది రోజుల ముందు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారి నాన్నను కలిసిన సమయంలో చాలా విషయాలు మాట్లాడాను.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు.
ఈ నెల 8న జరిగే వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు తప్పని సరిగా రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆహ్వానించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని భారీ ఎత్తున నిర్వహించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ జయంతి.. జులై 08వ తేదీన తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.