Home » Technology
స్మార్ట్ఫోన్లు... మనిషి జీవితంలో ఒక విడదీయలేని ఎలెక్ట్రానిక్ పరికరంగా మారాయి. విద్య, వినోదం, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆన్ లైన్ చెల్లింపులు మొదలైన ఎన్నో పనులను ఫోన్లు సులభతరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న యూజర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.
మీరిప్పటిదాకా ఎన్నో రకాల సొగసైన, శక్తిమంతమైన బైకులను చూసుకుంటారు. కానీ ఇలాంటి బాహుబలి బైకును ఇంతకు ముందు ఎక్కడా, ఎన్నడూ చూసుండరు. ఎందుకంటే... సోవియట్ యుద్ధ ట్యాంకర్ ఇంజను అమర్చిన ఈ బైకు బరువు ఏకంగా 5 టన్నులు.
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ జెమిని(Google Gemini) ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్‌లను కంపోజ్ చేయడానికి, భారీ ఇమెయిల్‌లను సంగ్రహించడానికి, ప్రెజెంటేషన్ నుంచి వివిధ అంశాలను హైలైట్ చేయడానికి, ముఖ్యమైన సమావేశాల కోసం రిమైండర్లను సెట్ చేయమని అడగడానికి జెమిని ఉపయోగపడుతుంది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్‌లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.
హ్యాకర్లు బ్యాంకుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లనూ వదలట్లేదు. తాజాగా కెనరా బ్యాంక్ అధికారిక సోషల్ మీడియా(Canara Bank X account hacked) హ్యాండిల్ X అకౌంట్ హ్యాక్‌కి గురైంది. హ్యాకర్లు అధికారిక ఎక్స్ హ్యాండిల్ పేరును 'ether.fi'గా మార్చారు.
వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్లెస్ చందాదారులను కలిగి ఉంది.
ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది.