103 ఏళ్ల వయసులోనూ ఓ వృద్దురాలి సాహసం.. Guinness World Records లో స్థానం..!

ABN , First Publish Date - 2022-06-16T22:35:53+05:30 IST

ప్రస్తుత జీవన విధానంలో 50ఏళ్లు వచ్చే సరికే చాలా మంది వివిధ సమస్యలతో మంచానికి పరిమితమవుతుంటారు. అలాంటి వయసులో వారికి తీరని కోరికలు ఉన్నా.. వాటిని..

103 ఏళ్ల వయసులోనూ ఓ వృద్దురాలి సాహసం.. Guinness World Records లో స్థానం..!

ప్రస్తుత జీవన విధానంలో 50ఏళ్లు వచ్చే సరికే చాలా మంది వివిధ సమస్యలతో మంచానికి పరిమితమవుతుంటారు. అలాంటి వయసులో వారికి తీరని కోరికలు ఉన్నా.. వాటిని నెరవేర్చుకునేందుకు సాహసం చేయలేని పరిస్థితి. ఇక 100ఏళ్లు ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వృద్ధురాలికి 103 సంవత్సరాల 259రోజుల వయస్సు ఉంది. ఈ వయసులో సజీవంగా ఉండడమే గగనం అనుకుంటే.. ఈ వృద్ధురాలు ఏకంగా గగన విహారమే చేసింది. ఏంటీ! ఆశ్చర్యపోతున్నారా.. ఈ వీడియో చూస్తే మీరు అవాక్కవుతారు. ఆమె చేసిన సాహసంతో Guinness World Records లో స్థానం కూడా సంపాదించింది.


స్వీడన్‌కు చెందిన రూట్ లార్సన్ అనే వృద్ధురాలికి ప్రస్తుతం 103 సంవత్సరాల 259 రోజుల వయస్సు ఉంది. ఆమెకు పారాచూట్‌పై ప్రయాణించాలనేది కోరిక. తన 90వ పుట్టిన రోజున మొదటి సారిగా పారాగ్లైడింగ్ చేసింది. అయితే మళ్లీ ఇంకో ప్రయత్నం చేసి రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుంది. ఇదే కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు కూడా మద్దతు తెలియజేయడంతో ఆమె తన కోరికను విజయవంతంగా నెరవేర్చుకుంది. మే 29, 2022న స్వీడన్‌లోని మోటాలాలో పారాచూట్ నిపుణుడు జోకిమ్ జాన్సన్‌తో కలిసి రికార్డును పూర్తి చేసింది. పారాగ్లైడింగ్ చేసిన అత్యంత వృద్ధ మహిళగా Guinness World Records లో స్థానం సంపాదించింది. ఆమె ఆకాశంలో విహరిస్తున్న సమయంలో కొంచెం కూడా భయం లేకుండా ఎంతో ఉత్సాహంగా కనిపించింది. మైదానంలోకి దిగగానే వృద్ధురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులు సాదరంగా స్వాగతం పలికారు.

Leave Letter లో ఓ ఉద్యోగి చెప్పిన కారణానికి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంత నిజాయితీ ఏంట్రా బాబూ అంటూ..


విజయ సంకేతం చూపుతూ సంతోషంగా కనిపించిన బామ్మను చూసి.. అంతా ఆశ్చర్యపోయారు. గిన్నిస్ సైట్ ప్రకారం, ఈ వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జన్మించింది. ప్రస్తుతం ఈమెకు ఐదుగురు పిల్లలు, 19 మంది మనవరాళ్లు, 30 మంది ముని మనవరాళ్లు ఉన్నారు. ఈమె కంటే ముందు కాథరిన్ అనే వృద్ధురాలు టెన్డం పారాచూట్ జంప్ చేసింది. 2019లో 103 సంవత్సరాల 129 రోజుల వయస్సులో కాథరిన్ “కిట్టి” హోడ్జెస్ చేసిన టెన్డం పారాచూట్ జంప్ రికార్డును లార్సన్ బద్దలు కొట్టింది.

కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..





Updated Date - 2022-06-16T22:35:53+05:30 IST