రోడ్డు ప్రమాద మృతుడి వద్ద బంగారాన్ని దొంగిలించిన 108 సిబ్బంది

ABN , First Publish Date - 2021-02-25T05:29:59+05:30 IST

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బంగారం వ్యాపారుల వద్ద నుంచి 108సిబ్బంది 2.3 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

రోడ్డు ప్రమాద మృతుడి వద్ద బంగారాన్ని దొంగిలించిన 108 సిబ్బంది
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సత్యనారాయణ

- ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు 

- 2.3కిలోల బంగారం స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

గోదావరిఖని, ఫిబ్రవరి 24: రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బంగారం వ్యాపారుల వద్ద నుంచి 108సిబ్బంది 2.3 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. రామగుండం సమీపంలో రాజీవ్‌ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు బోల్తాపడింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించారు. గంటల వ్యవధిలోనే చోరీకి పాల్పడిం ది 108 సిబ్బందిగా గుర్తించి వారి నుంచి 2.3కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 108 అంబులెన్స్‌ ఈఎన్‌టీ తాజుద్దీన్‌, డ్రైవర్‌ గుజ్జుల లక్ష్మారెడ్డిలను అరెస్టు చేశారు. బుధవారం కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల స మావేశంలో కమిషనర్‌ సత్యనారాయణ బంగారం చోరీ, నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన కొత్త శ్రీని వాసరావు, కొత్త రాంబాబు, గుండా సంతోష్‌లు కలిసి బం గారం వ్యాపారం చేస్తుంటారని, ఆర్డర్లపై ఆభరణాలు సప్లై చేస్తుంటారన్నారు. వీరు డ్రైవర్‌తో కలిసి 5.6కేజీల బంగారు ఆభరణాలను వారి చొక్కాల్లో పెట్టుకుని తీసుకువస్తుండగా, 23వ తేది ఉదయం 5గంటలకు రామగుండం సమీపంలోని మల్యాలపల్లి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టిందన్నారు. కొత్త శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతిచెందాడని, గుండా సంతోష్‌ను గోదావరిఖని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారని తెలి పారు. సంతోష్‌ జేబులో కేజీ బంగారం దొరుకగా ఈఎన్‌టీ చాందర్‌, డ్రైవర్‌ రాజేందర్‌ ఆ ఆభరణాలను రామగుండం ఎస్‌ఐ శైలజకు అందించారన్నారు. ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న కొత్త రాంబాబును కమాన్‌పూర్‌కు చెం దిన 108 అంబులెన్స్‌లో ఈఎన్‌టీ తాజుద్దీన్‌, డ్రైవర్‌ గుజ్జుల లక్ష్మారెడ్డిలు గోదావరిఖని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మృతిచెందాడన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతిచెందిన కొత్త శ్రీనివాస్‌ వద్ద రామగుండం పోలీసులకు 2.3కేజీల బంగారు ఆభరణాలు లభించాయన్నారు. మృతుల సోదరుడు కొత్త నాగేశ్వర్‌రావు తమవారి వద్ద అందాద 5.6కిలోల బంగారు ఆభరణాలు ఉంటాయని రామగుండం పోలీసులకు తెలిపారు. అప్పటివరకు పోలీసుల వద్దకు 3.3కిలోల బంగారం మాత్ర మే చేరిందని, మిగిలిన 2.3కిలోల బంగారం గురించి విచారణ మొదలుపెట్టామన్నారు. రామగుండం సీఐ కరుణాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపామన్నారు. కమాన్‌పూర్‌ అంబులెన్స్‌కు చెందిన తాజుద్దీన్‌, గుజ్జుల లక్ష్మారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. కొనఊపిరితో ఉన్న కొత్తరాంబాబుకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న సందర్భంలో అతని జేబులో రెండు ప్లాస్టిక్‌ కవర్లలో అందాద 2.3కిలోల బంగారు ఆభరణాలు చూసేరికి తాజుద్దీన్‌ మనసులో దురాశ కలిగిందన్నా రు. అతడు, డ్రైవర్‌ లక్ష్మారెడ్డి చెరొక బంగారు ఆభరణాల క వర్లను పంచుకున్నారన్నారు. రాంబాబు మృతదేహాన్ని ఆసు పత్రి వద్ద దించారని, అతని మృతదేహాన్ని పరిశీలించినట్టు చేసి, అతని వద్ద ఏమిలేదని చెప్పి ఇంటికి వెళ్లిపోయారన్నా రు. అంబులెన్స్‌ ఈఎన్‌టీ తాజుద్దీన్‌ను గోదావరిఖని రమేష్‌నగర్‌లోని అతని ఇంటివద్ద,లక్ష్మారెడ్డిని బస్టాండ్‌వద్ద అరెస్టు చేశామన్నారు. వీరివద్ద రూ.1.5కోట్ల విలువైన బంగారు ఆ భరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యాపారుల వద్ద లభించిన రశీదులో ఆరు కిలోలకు పైగా ఆభరణాలు తీసు కెళుతున్నట్టు పేర్కొన్నారని, అతని సోదరుడు మాత్రం 5.6 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలిపారన్నారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని రికవరీ కూడా చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ 6కిలోల పైగా బంగారు ఆభరణాలు తీసుకువచ్చినట్లయితే ఆ కోణంలో విచారణ జరుపుతామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, రామగుండం సీఐ కరుణాకర్‌రావులను అభినందించారు. సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, అడిషనల్‌ డీసీపీ(ఏఆర్‌) సంజీవ్‌, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, రామగుండం సీఐ కరుణాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, రామగుండం ఎస్‌ఐ శైలజ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:29:59+05:30 IST