Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 15 2021 @ 17:02PM

గుజరాత్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం.. రూ. 600 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

గాంధీనగర్: గుజరాత్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. సెప్టెంబరు 13న ముంద్రా పోర్టులో 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడడం అప్పట్లో సంచలనమైంది. దాని విలువ రూ. 20 వేల కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే తాజాగా  120 కేజీల హెరాయిన్ పట్టుబడింది.


సౌరాష్ట్ర పరిధి మోర్బిలోని ఓ గ్రామంలో గత రాత్రి రూ. 600 కోట్ల విలువైన హెరాయిన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఇది సముద్ర మార్గం గుండా వచ్చిందని, నిందితుడికి అది పాకిస్థాన్ పడవ నుంచి డెలివరీ అయిందని డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement